హైదరాబాద్, నవంబర్5 ; ఉత్తమ్ కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు సమక్షంలో వాగ్వాదానికి దిగిన ఈఎన్సీ అనిల్ కుమార్, కొత్తగూడెం సీఈ శ్రీనివాస్ రెడ్డికి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. మంత్రుల ఎదుట ఎందుకు వాదనకు దిగాల్సి వచ్చిందనే వివరాలను మూడు రోజుల్లోగా చెప్పాలని ఆదేశించినట్టు తెలిసింది. ఇటీవల సీతారామ ఎత్తిపోతల పథకంపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపాలన అనుమతులు లేకుండానే డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం, ఇతర పనులకు టెండర్లు ఆహ్వానించారనే అంశం చర్చకు వ చ్చినట్టు సమాచారం. ఈ సందర్భం గా ఈఎన్సీ, సీఈ మధ్య వాగ్వాదం జరిగినట్టు ఇరిగేషన్ శాఖ వర్గాలు తెలిపాయి. మంత్రుల సమక్షంలోనే దురుసుగా ప్రవర్తించడంతో ప్రభు త్వం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.
‘నాగారం’ కేసులో మాజీ ఆర్డీవోకు ఈడీ సమన్లు
హైదరాబాద్, నవంబర్ 5 (నమ స్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని నాగారం భూ వి వాదం కేసులో మాజీ ఆర్డీవో వెంకటాచారికి ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు. మహేశ్వరంలోని నాగారం లో సర్వేనంబర్ 181లోని 42 ఎకరాల భూ కేటాయింపులపై ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు వెంకటాచారికి శుక్రవారం విచారణకు హాజరుకావాలని
కోరినట్టు సమాచారం.