హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఇతర రాష్ర్టాల్లో లేని యూరియా కొరత తెలంగాణలోనే ఎందుకు వచ్చిందని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ లోపంతోనే యూరియా కొరత అని ఆరోపించారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఓటు చోరీపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ బాధ్యత మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.