అమీర్‌పేట్, అక్టోబర్ 1: దసరా పండుగ వేళ చేసే షాపింగ్‌తోపాటు సంభ్రమాశ్చర్యాల్లో ముంచె త్తే బహుమతులను ఇంటికి తీసుకొస్తే..ఆ ఆనందం పండుగ సంతోషాలను రెట్టింపు చేస్తుంది. ప్రతి ఏటా మాదిరిగానే నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలు సమర్పిస్తున్న దసరా అతిపెద్ద షాపింగ్ బొనాంజా శుభారంభమైంది. ఈ ఏడాది కూడా అంతే ఉత్సాహంతో కొనుగోలుదారుల కలలను నిజం చేసేందుకు మంగళవారం అమీర్‌పేట్‌లోని కేఎల్ఎం ఫ్యాషన్ మాల్లో కొనుగోలుదారులు, అభిమానుల సమక్షంలో దసరా షాపింగ్ బొనాంజా వైభవంగా ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలనతో జరిగిన ఈ ఆవిష్కరణలో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికల ప్రకటనల విభాగం జీఎం ఎన్ సురేందర్‌రావు, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ స్ట్రాటజీ హెడ్ సీవీ రావు, నమస్తే తెలంగాణ ప్రకటనల విభాగం ఏజీఎంలు పీ రాములు, రాజిరెడ్డి, డిప్యూటీ మేనేజర్ సందీప్ జోషి పాల్గొన్నారు. ఈ బొనాంజకు సంబంధించి నగరంలోని ఎంపిక చేయబడిన ఔట్లెట్ల వివరాలతో కూడిన సమాచారం నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికల్లో రోజూ ప్రచురితమవుతాయి. ఈ అతిపెద్ద బొనాంజాకు కేఎల్ఎం షాపింగ్‌మాల్ మెయిన్ స్పాన్సర్‌గా, పవర్డ్ బై ఆల్మండ్ హౌస్, గిఫ్ట్ స్పాన్సర్‌గా బిగ్ సీ, టీవీ పార్ట్నర్గా టీ న్యూస్, డిజిటల్ పార్ట్నర్గా ఎస్ టీవీలు వ్యవహరిస్తున్నాయి. ఈ బొనాంజాకు కున్ హ్యుందయ్, హర్ష టయోట, ఆరెంజ్ గ్రూప్, మానేపల్లి జువెలర్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) భాగస్వాములుగా ఉన్నాయి.
50 ఔట్లెట్లలో గిఫ్ట్ కూపన్లు
ఈ నెల 1 నుంచి 9 వరకు ఎంపికచేసిన ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆటోమొబైల్ కంపెనీలు, టెక్స్టైల్, జువెల్లరీ, ప్రొప్రైటరీ వంటి ఎంపిక చేసిన 50 ఔట్లెట్లలో కస్టమర్లు చేసే షాపింగ్‌తో బహుమతుల కూపన్లను అందుకోవచ్చు. గత పదేండ్లుగా పాఠకులతోపాటు దసరా షాపింగ్ కొనుగోలుదారులకు రోజూ లక్కీడ్రాలో బహుమతులు గెలుచుకోవడం ద్వారా మరచిపోలేని మధురానుభూతులను పంచుతున్నది. కస్టమర్లు షాపింగ్ తర్వాత తమకు ఇచ్చిన కూపన్లలో వివరాలు పూరించి అక్కడే డ్రాప్ బాక్సులో వాటిని వేయాలి. మరుసటి రోజు లక్కీ డ్రా ద్వారా విజేతలుగా నిలిచే అవకాశం ఉంటుంది. రోజూ లక్కీ డ్రాలో ముగ్గురిని విజేతలుగా ఎంపిక చేస్తారు. విజేతలు 32 ఇంచుల టీవీ, స్మార్ట్ ఫోన్, గిఫ్ట్ వోచర్లు బహుమతులుగా అందుకుంటారు.
పదేండ్లుగా మధురానుభూతులు
పదేండ్లుగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలు దసరా బొనాంజాను పాఠకుల ముందుకు తీసుకొస్తున్నాయి. ఈ బొనాంజ పాఠకులతోపాటు కొనుగోలుదారులకు మధురానుభూతులను పంచుతున్నది. మాతో కలిసి నడిచే సంస్థలకు వ్యాపారాలను పెంచుకునే అవకాశం, కస్టమర్లకు బహుమతులు దసరా బొనాంజాతో అందుతున్నాయి. నగరంలో ఎంపిక చేసిన 50 ఔట్లెట్లలో ఎక్కడ షాపింగ్ చేసినా దసరా బొనాంజా ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
– ఎన్ సురేందర్‌రావు, జీఎం, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ప్రకటనల విభాగం
సరసమైన ధరలు.. చక్కటి ఆఫర్లు
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికల దసరా బొనాంజాకు ఏటా కేఎల్ఎం సంస్థ భాగస్వామ్యాన్ని అందిస్తున్నది.ఈ దసరాకు కేఎల్ ఎం అద్భుతమైన ఆఫర్లతో వస్తున్నాం. సరసమైన ధరలు, చక్కటి ఆఫర్లు, సరికొత్త డిజైన్లు ఉన్నాయి. నగరంలోని 10 కేఎల్ఎం ఔట్లెట్లలో మా కస్టమర్లకు రోజూ లక్కీ డ్రా ద్వారా బహుమతులను గెలుచుకునే చక్కటి అవకాశాన్ని కల్పిస్తున్నాయి.
– సీవీ రావు, స్ట్రాటజీ హెడ్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్