హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. అమెరికా పోలీసులు, బంధువుల వివరాల ప్రకారం.. ఏపీలోని విశాఖకు చెందిన చిట్టూరి సత్యకృష్ణ (27)కు గతేడాది వివాహమైంది. ప్రస్తుతం ఆయన భార్య గర్భవతి. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఓల్డ్ బర్మింగ్‌హామ్ హైవే మీద ఉన్న క్రౌన్ సర్వీస్ స్టేషన్ స్టోర్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు. ఈ నెల 10వ తేదీ ఉదయం 9.45 గంటల ప్రాంతంలో (అమెరికా కాలమానం ప్రకారం) ఆ స్టోర్‌లోకి గుర్తుతెలియని దుండగుడు ప్రవేశించి కాల్పులకు దిగాడు. సత్యకృష్ణకు బుల్లెట్లు నేరుగా తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. సత్యకృష్ణ మరణవార్త తెలియగానే ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు.