హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ప్రముఖ పాత్రికేయుడు, కవి, రచయిత, చిత్రకారుడు శీలా వీర్రాజు (83) బుధవారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీర్రాజుకు భార్య, రచయిత్రి శీలా సుభద్రాదేవి, కూతురు ఉన్నారు. ‘శీలావి’గా సుప్రసిద్ధులైన ఆయన రంగుటద్దాలు, పగా మైనస్ ద్వేషం, వాళ్ల మధ్య వంతెన తదితర కథలు, కొడిగట్టిన సూర్యుడు, హృదయం దొరికింది తదితర కవితా సంపుటాలు, వెలుగు రేఖలు, కాంతిపూలు, మైనా తదితర నవలలు రాశారు.
అంత్యక్రియలు బుధవారం జరుగుతాయి. అనేక పుస్తకాలకు ముఖచిత్రాలు గీసిన శీలా వీర్రాజు 1939 ఏప్రిల్ 22న రాజమండ్రిలో జన్మించారు. 1961లో హైదరాబాద్ నుంచి వెలువడే కృష్ణ పత్రికలో సబ్ ఎడిటర్‌గా చేరారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు చాలాకాలం పాటు నిర్వహించారు.