మారేడ్‌పల్లి, జూలై 19 : పండగలు మన సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు చాటిచెప్పే గొప్ప సంప్రదాయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివా స్‌యాదవ్ అన్నారు. ఆదివారం మోండా డివిజన్ ఆదయ్యనగర్ లోని 18 టెంపుల్స్‌లో బోనాల ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారు, నల్లపోచమ్మ అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, భక్తుల కోలాహాలంతో ఆయన పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను శాలువాతో సత్కరించారు. ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలయజేస్తూ…అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే తలసాని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, ఆలయ నిర్వాహకులు ఏకాంబరం, సాయిబాబా, చంద్రశేఖర్, జ్ఞానేశ్వర్, రాములు, భాస్కర్, రాజు, నాయకులు శ్రీకాంత్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.