నిషేధిత జాబితా నుంచి ఆ 32 ఎకరాలు తొలగించాలి
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లిలోని 626, 638, 639, 640 సర్వే నంబర్లలో ఉన్న 32.26 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని హైకోర్టు రెవెన్యూ అధికారులను ఆదేశించింది. అది వక్ఫ్ భూమి కాదని గతంలోనే హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
- కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే రికార్డులు ఉండాలన్న హైకోర్టు
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లిలోని 626, 638, 639, 640 సర్వే నంబర్లలో ఉన్న 32.26 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని హైకోర్టు రెవెన్యూ అధికారులను ఆదేశించింది. అది వక్ఫ్ భూమి కాదని గతంలోనే హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. చటాన్పల్లిలోని 32.26 ఎకరాలను వక్ఫ్ భూమిగా పేరొంటూ గతంలో జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ చెల్లదని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసినప్పటికీ ఆ భూమిని నిషేధిత జాబితాలో కొనసాగిస్తున్నారంటూ శంషాబాద్ మండ లం పాలమాకులకు చెందిన పీ లక్ష్మణ్, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ విచారణ చేపట్టారు.
వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ.. రెవె న్యూ రికార్డులు కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఉండాలని తేల్చిచెప్పారు. గెజిట్ నోటిఫికేషన్ను హైకోర్టు రద్దు చేసినప్పటికీ ఈ భూమిని వక్ఫ్ ఆస్తిగా పేరొంటూ నిషేధిత జాబితాలో కొనసాగించడం చట్టవిరుద్ధమైన ఆంక్షల కిందికే వస్తుందని స్పష్టం చేశారు. ఈ తీర్పు ప్రతి అందిన 4 వారాల్లోగా ఆ 32.26 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

