మహబూబ్‌నగర్, ఏప్రిల్ 17: యువ కవులకు మరింత ప్రాధాన్యమిస్తూ ప్రోత్సహించాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కవులకు, కళాకారులకు సముచితస్థానం కల్పిస్తున్నదని స్పష్టంచేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అవధాని డాక్టర్ అముదాల మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన శతావధానం ముగింపు కార్యక్రమానికి ఆదివారం ఎంపీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు కవులను వారుఘనంగా సత్కరించారు. అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో సాహిత్యానికి సంబంధించిన మరిన్ని కార్యక్రమాలను నిర్వహించుకొందామని అన్నారు. అంతకుముందు కవులు అనేక సందేహాలతో కూడిన సమస్యలను కవిత్వంతో సంధించగా.. ఆముదాల మురళి సమాధానాలిచ్చారు.