మహదేవపూర్, జూన్ 18 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని లక్ష్మీ (మేడిగడ్డ) బరాజ్‌లోని ఏడో బ్లాక్‌లో చేపట్టిన షీట్ ఫైల్స్ అమరిక పనులు తుది దశకు చేరుకున్నాయి. ఏడో బ్లాక్‌లోని 11 పిల్లర్లకు 15-22 పిల్లర్ల వరకు షీట్‌ఫైల్స్ పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మిగతా 12, 13, 14వ పిల్లర్ల వద్ద పనులు కొనసాగుతున్నాయి.
నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) సూచనల మేరకు బరాజ్‌లో చేపట్టిన పనులను మంగళవారం భారీ నీటిపారుదల శాఖ ఈఈ తిరుపతిరావు పరిశీలించారు. బరాజ్ 20, 22వ పియర్ల వద్ద చేపట్టిన గ్రౌటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సీసీ బ్లాక్‌ల రీ అరేంజ్మెంట్ పనులు కొనసాగుతున్నాయి. ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఇసుకను తొలగిస్తున్నారు. బరాజ్‌లోని మొత్తం 85 గేట్లకు 84 గేట్లను ఎత్తగా, 20వ గేట్‌ను ఆర్క్ గ్రౌగింగ్తో కట్ చేయగా, విడి భాగాలను తొలగించే పనులు జరుగుతున్నాయి.