TG Secretariat | హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సచివాలయ ఉద్యోగులకు బుధవారం నుంచి ఫేసియల్ రికగ్నైజేషన్ ద్వారా హాజరు నమోదు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. మంగళవారం ఆమె అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
సచివాలయంలోని అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులకు ఈ విధానం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ విధానాన్ని వెంటనే అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.