హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరగనున్న ఆది శంకరాచార్య జయంతి మహోత్సవానికి హాజరుకావాలని సీఎం కేసీఆర్కు మంగళవారం నిర్వాహకులు ఆహ్వానపత్రిక అందజేశారు. వేదాంత భారతి,
రుషిపీఠం, తత్వం చారిటబుల్ ట్రస్టు, శంకరాచార్య భక్త సమాజం ఆధ్వర్యంలో మే 2 నుంచి 11 రోజులపాటు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు చాగంటి, గరికపాటి, షణ్ముఖశర్మ వంటి పండితుల ప్రవచనాలు ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు.