సిటీబ్యూరో, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ): శంషాబాద్‌లోని అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు విమానసేవల్లో దూసుకుపోతున్నది. నాణ్యత, పరిశుభ్రత, మెరుగైన సేవలను ఆడిట్ చేసిన అంతర్జాతీయ రేటింగ్ స్కై ట్రాక్స్ 4 స్టార్ రేటింగ్‌ను ఇచ్చింది. ఈ సందర్భంగా సీఈవో ప్రదీప్ ఫణికర మాట్లాడుతూ.. కొత్త ప్రమాణాలతో ఆపరేషనల్ ఎక్స్‌లెన్సీ సాధించడంతో ఈ రేటింగ్ సాధ్యమైందని తెలిపారు. నావిగేషన్ సులభతరం, చెక్ ఇన్ ప్రక్రియ, వే ఫైండింగ్ సామర్థ్యాలను వేగంగా చేయడంలో ఆధునిక డిజిటల్ టెక్నాలజీలను అమలు చేస్తున్నామని తెలిపారు. 1989 నుంచి అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాలు, విమాన సంస్థలను అంచనా వేస్తూ స్కై ట్రాక్స్ 1 నుంచి 5 మధ్య స్టార్ రేటింగ్లను కేటాయిస్తున్నదని జీఎంఆర్ వర్గాలు వెల్లడించాయి.