బీజేపీ నేత ఈటలపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజం
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తప్పుడు ఆలోచనలతో టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిన ఈటల రాజేందర్ సహనం కోల్పోయి మాట్లాడుతున్నాడని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ఎంతో నిబద్ధత,క్రమశిక్షణతో వ్యవహరించే మంత్రి హరీశ్‌రావుపై ఈటల విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. శుక్రవారం ఆయన ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో మీడి యాతో మాట్లాడుతూ.. ఈటలను సీఎం కేసీఆర్ సొంత తమ్ముడిలా చూసుకోవడంతోపాటు హరీశ్‌రావు, కేటీఆర్‌ను కాద ని టీఆర్ఎస్ఎల్పీ లీడర్‌గా అవకాశమిచ్చారని గుర్తుచేశారు. దేశంలో ఏ రాష్ట్రం ఆదుకోనంతగా పౌల్ట్రీపరిశ్రమను కేసీఆర్ ఆదుకు న్నారని చెప్పాన్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బీజేపీలో చేరిన ఈటల ఆ పార్టీలో ఆత్మగౌరవం ఎక్కడున్నదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీలో చేరి తప్పుచేశామని చాలామంది చింతిస్తున్నారని పేర్కొన్నారు.