హైదరాబాద్ : చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన షాలిని – జానేశ్వర్ జంట రక్షణ కల్పించాలని జగిత్యాల జిల్లా గంగాధర పోలీసులను ఆశ్రయించారు. తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ పోలీసులను జంట కోరింది. దీంతో ఆయన స్పందించి రాజన్న సిరిసిల్ల పోలీసులకు జంటను అప్పగించారు. ఇదిలా ఉండగా.. చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన యువతి షాలినిని మంగళవారం తెల్లవారుజామున 5:20 గంటలకు కిడ్నాప్‌నకు గురైంది. తమ కూతురు కిడ్నాప్‌పై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉండగానే.. కీలక మలుపు తిరిగింది.
ప్రేమికుడు జ్ఞానేశ్వర్‌ను పెళ్లి చేసుకున్నట్లు వీడియో విడుదల చేసింది. నాలుగేళ్లుగా జ్ఞానేశ్వర్‌ను ప్రేమిస్తున్నట్లు తెలిపింది. అయితే, ఏడాది కిందటే ఇంట్లో నుంచి జంట పారిపోయి పెళ్లి చేసుకోగా.. షాలిని మైనర్కావడంతో తల్లిదండ్రులు కిడ్నాప్ కేసు పెట్టారు. ఏడాది నుంచి ఇద్దరు వేరుగానే ఉంటున్నారు. ఇటీవల షాలినికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారు. ఇవాళ్టితో మైనారిటీ తీరడంతో తనను ఇంట్లో నుంచి తీసుకెళ్లాలని జ్ఞానేశ్వర్‌ను కోరింది. ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని వీడియోలో షాలిని తెలిపింది. కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులను గంగాధర పోలీసులను ప్రేమజంట ఆశ్రయించగా.. ఎస్ఐ వారిని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులకు అప్పగించారు.