హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసేందుకు, అణగారిన వర్గాలకు ప్రాణం పోసేందుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీల విలీనాన్ని సుగుణమ్మ ఆకాంక్షించారని, ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ కొండాపూర్లోని సీఆర్ ఫౌండేషన్ ఇంద్రజిత్గుప్తా హాల్లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ప్రముఖ కమ్యూనిస్టు నేత శాఖమూరి సుగుణమ్మ సంస్మరణ సభ ఆదివారం జరిగింది.
ఈ సందర్భంగా సీఆర్ ఫౌండేషన్ గౌరవవాధ్యక్షుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ హాజరై మాట్లాడుతూ.. సుగుణమ్మ మరణం మహిళా ఉద్యమాలకు తీరని లోటు అని పేర్కొన్నారు. సుగుణమ్మ చివరి శ్వాస వరకు ఉద్యమాల కోసం పనిచేశారని గుర్తుచేశారు.