హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో కరువు ఛాయలు నెలకొన్నాయి. గత నెలలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణం కంటే 54శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. 11 జిల్లాల్లో వర్షం జాడే లేకుండా పోయింది. దీంతో పంటలు ఎండుముఖం పట్టడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ నెల నుంచే పొడి వాతావరణం ఏర్పడింది. దీనికితోడు విద్యుత్ కొరత వేధిస్తున్నది. రోజుకు కనిష్ఠంగా 3 గంటలు కోత విధిస్తున్నారు.