Shabbir Ali | హైదరాబాద్, జూన్ 24(నమస్తే తెలంగాణ): అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చేర్చుకోలేదా అని బీఆర్ఎస్ను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రశ్నించారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తుంటే విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం గాంధీభవన్లో మాట్లాడుతూ గతంలో తనకు శాసనమండలిలో, భట్టి విక్రమార్కకు శాసనసభలో ప్రతిపక్షహోదా లేకుండా చేయలేదా? అని ప్రశ్నించారు. కోకాపేటలో బీఆర్ఎస్కు కేటాయించిన స్థ లాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.
రుణమాఫీ చేస్తాం: కోదండరెడ్డి
రైతులకిచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్రెడ్డి రుణమాఫీ చేస్తున్నారని, ఇది కేసీఆర్, కేటీఆర్కు ఇష్టం లేనట్టుగా ఉందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ ప్రతి అంశంలోనూ కేటీఆర్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. రైతుభరోసాపై వాస్తవాలు తేల్చేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేస్తే కేటీఆర్కు ఇబ్బందేమిటని ప్రశ్నించారు.