వికారాబాద్, నవంబర్ 7: వికారాబాద్ జిల్లాలో బాలికపై లైంగికదాడి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మర్పల్లి మండలానికి చెందిన ఓ బాలిక శంకర్పల్లి హాస్టల్లో ఉంటూ పదోతరగతి చదువుతున్నది. బాలికను హాస్టల్ వద్ద దింపాలని ఆమె తల్లిదండ్రులు శుక్రవారం ఆటో డ్రైవర్‌కి చెప్పి పంపించారు. అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నర్సింహులు, వాహెద్ అనే వ్యక్తులు శంకర్‌పల్లికి వెళ్లే మార్గంలో మోమిన్‌పేట పరిధిలోని దేవరంపల్లి అడవిలో సదరు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న వికారాబాద్ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, మోమిన్‌పేట ఇన్స్పెక్టర్ వెంకట్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నర్సింహులు, వాహెద్‌పై పోక్సో కేసు నమోదు చేశారు.