సారంగాపూర్, నవంబర్ 16 : జగిత్యాల జిల్లాలో ఏడేళ్ల బాలికపై లైంగికదాడి కేసులో సీహెచ్ బాపుపై జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ పోక్సో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ గీత తెలిపారు. శనివారం బాలిక తన ఇంటి ముందు ఆడుతుండగా ఎవరూలేని సమయంలో బాపు బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడని పేర్కొన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో ఆదివారం నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టు వెల్లడించారు.