చిక్కడపల్లి, ఆగస్టు 21 : కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కాం గ్రెస్ ప్రభుత్వ నైతిక బాధ్యత అని పలువు రు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేం ద్రంలో తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రైతు ఉద్యమ నాయకుడు, ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ మాట్లాడు తూ.. కౌలు రైతులకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేశా రు. 2023 సెప్టెంబర్ 13న పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి తెలంగాణ కౌలు రైతులకు గుర్తింపు ఇస్తామని హామీ ఇస్తూ బహిరంగ లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తు న్నా కౌలు రైతుల పరిస్థితి మారలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రొఫెసర్ హ రగోపాల్ మాట్లాడుతూ.. కౌలు రైతులకు గుర్తింపు లేక, ప్రభుత్వ హామీలు అమలుకాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడు తూ.. వ్యవసాయం సంక్షోభంలో ఉన్న తరుణంలో కౌలు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని తెలిపారు. విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి మాట్లాడుతూ.. ఎస్సీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన కౌలు రైతులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని పేర్కొన్నారు. ప్రొఫెసర్ నర్సింహారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో విస్సా కిరణ్, కన్నెగంటి రవి, బీ కొండల్‌రెడ్డి, పీ శంకర్, రైతు సంఘాల నాయకులు, కౌలు రైతులు పాల్గొన్నారు.