హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ )/ హయత్‌నగర్ : నగరంలోని హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏడో తరగతి విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, కు టుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉ న్నాయి. వనపర్తి జిల్లా, రేవల్లి మండ లంలోని శానాయిపల్లికి చెందిన పండగ మధుసూదన్‌రెడ్డి కుమారుడు లోహితస్య రెడ్డి(12) ఈ ఏడాది నారాయణ స్కూల్లో ఏడో తరగతిలో చేరాడు. అక్కడే హాస్టల్ లోనే ఉంటూ చదువుతున్నాడు. రెండు నెలల క్రితం తాను హాస్టల్లో ఉండలేనని తల్లిదండ్రులకు తెలిపాడు. ఏడో తరగతి పూర్తయ్యే వరకు ఆగాలని వారు సూచించా రు. మనస్తాపానికి గురైన లోహితస్యరెడ్డి సో మవారం రాత్రి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకు న్నాడు. యాజమాన్యం ప్రైవేటు దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.