భువనగిరి కలెక్టరేట్, జూన్ 13: యాదాద్రి భువనగిరి జిల్లాలో అనుమతులు లేని ఏడు ప్రైవేట్ దవాఖానలను సీజ్ చేసినట్టు జిల్లా వైద్యాధికారి డాక్టర్ కే మల్లికార్జునరావు సోమవారం తెలిపారు. తుర్కపల్లి మండలం మాదాపూర్‌లోని సూర్య హాస్పిటల్, చౌటుప్పల్‌లోని శ్రీపూజిత హాస్పిటల్, మోత్కూర్‌లోని శారద క్లినిక్, మాధవి నర్సింగ్ హోం, తేజ నర్సింగ్‌హోం, భువనగిరిలోని శ్రీస్వాతి, తేజస్విని హాస్పిటల్‌ను సీజ్ చేశామని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా లింగనిర్ధారణ పరీక్షలు చేయడం, అనుభవం లేని డాక్టర్లతో చికిత్స అందిస్తుండటంతో చర్యలు తీసుకొన్నట్టు తెలిపారు.