జీడిమెట్ల : జీడిమెట్ల ( Jeedimetla ) పోలీస్ స్టేషన్ సిబ్బంది గాజులరామారం-జీడిమెట్ల ప్రాంతంలోని హెచ్ఏఎల్ ఏరియాలో అద్దె ఇంట్లో ఉన్న ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయుల ( Bangladeshi Nationals )ను అరెస్టు చేశారు. కొన్ని రోజులుగా వీరు అక్రమంగా అక్రమంగా నివసిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులకు అక్కడికి వెళ్లి సోదాలు నిర్వహించారు.
అక్కడ ఉన్న ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను అదుపులోకి తీసుకుని విచారించగా భారతదేశంలో ఉండేందుకు ఎలాంటి పాస్‌పోర్టులు, వీసాలు ,ఇతర ప్రయాణ పత్రాలు లేవని పోలీసులు తెలిపారు . భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశించి దేశంలోని వివిధ ప్రాంతాల్లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని వివరించారు.
అదుపులోకి తీసుకున్న వ్యక్తులను మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ సెంటర్‌కు తరలిస్తున్నారు. పట్టుబడ్డ వారిని వారి స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ లో ఎస్వోటీ కూకట్పల్లి జోన్ సిబ్బంది పాల్గొన్నారు.