ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 4: ఈ నెల 13న నిర్వహించాల్సిన టీఎస్ సెట్-2022ను వాయిదా వేసినట్టు సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ సీ మురళీకృష్ణ శనివారం వెల్లడించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల నేపథ్యంలో వాయిదా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ఈ పరీక్షను తిరిగి నిర్వహించాల్సిన తేదీని 10వ తేదీలోగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. 14, 15 తేదీల్లో పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తామని వెల్లడించారు.