హైదరాబాద్, మే 3 (నమస్తే తెలంగాణ) : బీటెక్ కోర్సుల్లో ల్యాట్రల్ ఎంట్రీ కోసం (రెండోసంవత్సరంలో) నిర్వహించే టీఎస్ ఈసెట్‌ను ఈనెల 6న నిర్వహించనునున్నట్టు సెట్ కన్వీనర్ పీ చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు.
ఇందుకు హైదరాబాద్‌లో 4, తెలంగాణ జిల్లాల్లో 48, ఏపీలో 7 చొప్పున మొత్తం 99 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 24,272 మంది విద్యార్థులు ఈసెట్‌కు హాజరుకానున్నట్టు వెల్లడించారు.