హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : సెప్టెంబర్‌లో ఉమెన్ సేఫ్టీ వింగ్‌లోని యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఆధ్వర్యంలో పిల్లల అక్రమ రవాణాకి పాల్పడిన వారిపై పెట్టిన 25 కేసుల్లో శిక్షలు పడ్డట్టు డీజీ శిఖాగోయెల్ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇది మార్చి రికార్డును అధిగమించినట్టు చెప్పారు. ఈ కేసుల ద్వారా నిందితులకు రూ.1,64,000 జరిమానాతో పాటు 5 రోజుల నుంచి 4 నెలల వరకు సాధారణ జైలు శిక్ష విధించారని పేర్కొన్నారు. నార్సింగి పీఎస్ పరిధిలోని 7 కేసులు, అత్తాపూర్‌లో 6, మైలార్‌దేవ్‌పల్లిలో 4, బాలానగర్‌లో 3, మియాపూర్‌లో 3, శంషాబాద్, కేబీహెచ్పీ పీఎస్‌ల పరిధిలో ఒక్కో కేసు నమోదైనట్టు చెప్పారు.