హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress govt) పాలనపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ సంవత్సర పాలనపై మావోయిస్టుల లేఖ రాయడం సంచలంగా మారింది. రేవంత్ రెడ్డి బుల్డోజర్ పాలనపై మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్(Maoist Jagan) బహిరంగ లేఖను విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, కార్పోరేట్ల కోసం పనిచేస్తుందని మండిపడ్డారు. పౌరుల ప్రాథమిక హక్కులను హరించి వేస్తూ హైడ్రా పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూసీ పేరుతో విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు రైతుల భూములను కొల్లగొట్టేందుకు పథకం పన్నారని విమర్శించారు. కుట్ర పూరితంగా కార్పొరేట్లకు మేలు చేసేలా రేవంత్ పాలన ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరే విధానలపై ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ సంవత్సర పాలనపై మావోయిస్టుల సంచలన లేఖ
హామీలను తుంగలో తొక్కి, కార్పోరేట్ల కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని బహిరంగ లేఖ రాసిన మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్. pic.twitter.com/Kp11aAUp2O
— Telugu Scribe (@TeluguScribe) November 14, 2024