బీటెక్ రెండేండ్లు చదివితే డిప్లొమా
బీటెక్, ఎంటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ తదితర సాంకేతిక విద్యా కోర్సులలో విప్లవాత్మక విధానానికి జేఎన్టీయూ హైదరాబాద్ శ్రీకారం చుట్టింది. కోర్సు మధ్యలో ఆపేసినా డిప్లొమా సర్టిఫికెట్ ప్రదానం చేయాలని నిర్ణయించింది.
- మధ్యలో మానేసినా సర్టిఫికెట్ ప్రదానం
- సిలబస్‌లో 70 శాతమే ప్రత్యక్ష బోధన
- 30 శాతం ఆన్లైన్.. ఇంటర్నల్స్‌కు 40 శాతం
- కోర్సు మధ్యలో ఉద్యోగం చేసొచ్చి మళ్లీ చేరొచ్చు
- జేఎన్టీయూ హైదరాబాద్ సంచలన నిర్ణయాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): బీటెక్, ఎంటెక్, బీఫార్మసీ, ఎంఫార్మసీ తదితర సాంకేతిక విద్యా కోర్సులలో విప్లవాత్మక విధానానికి జేఎన్టీయూ హైదరాబాద్ శ్రీకారం చుట్టింది. కోర్సు మధ్యలో ఆపేసినా డిప్లొమా సర్టిఫికెట్ ప్రదానం చేయాలని నిర్ణయించింది. సిలబస్‌లో ఇకనుంచి 70 శాతమే ప్రత్యక్ష బోధన ఉండాలని, 30 శాతం ఆన్లైన్ బోధన నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆన్లైన్ బోధనలో పలు ఐఐటీలకు చెందిన ఫ్యాకల్టీల సేవలు వినియోగించుకోనున్నారు. 182 మంది సభ్యులతో కూడిన ‘బోర్డ్ ఆఫ్ స్టడీస్’ మూడు రోజుల సమావేశాలను వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సమావేశాల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు.
జేఎన్టీయూ బోర్డ్ ఆఫ్ స్టడీస్ నిర్ణయాలు
- బీటెక్‌లో చేరిన విద్యార్థులు కోర్సు పూర్తిచేయకుండా రెండు, మూడేండ్లకే కాలేజీ మానేసిన పక్షంలో వారు నష్టపోకుండా డిప్లొమా సర్టిఫికెట్ జారీ చేస్తారు.
- నాలుగేండ్ల కోర్సు పూర్తిచేస్తే డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తారు.
- ఫ్లెక్సిబుల్ విద్యావిధానాన్ని అమల్లోకి తేనున్నారు. అంటే నాలుగేండ్ల బీటెక్‌లో విద్యార్థి మూడేండ్లు చదివి, నాలుగో సంవత్సరం ఎక్కడైనా ఉద్యోగం చేసుకొని, తిరిగి ఫైనల్ ఇయర్లో చేరి కోర్సు పూర్తిచేయాలనుకొంటే, అందుకు అవకాశం కల్పిస్తారు.
- ప్రతి కోర్సులోని మొత్తం సిలబస్‌లో 70 శాతమే ప్రత్యక్ష బోధన. 30 శాతం ఆన్లైన్ బోధన ఉంటుంది.
- కోర్సు ఇంటర్నల్స్‌కు ఇప్పటివరకు 25 శాతం మార్కులుండగా, కొత్త సిలబస్‌లో 40 శాతానికి పెంచుతారు.
- వార్షిక పరీక్ష 60 శాతం మార్కులకే నిర్వహిస్తారు.
- 2022-23 నుంచే కొత్త విధానం అమలు చేస్తారు.
- బీటెక్‌లో 160 క్రెడిట్స్ కేటాయించారు.
- విద్యార్థులు ఏకకాలంలో రెండు డిగ్రీలు పూర్తి చేసుకొనే అవకాశం ఇస్తారు. అంటే బీటెక్ విద్యార్థి, బీబీఏ వంటి కోర్సులో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. ఒక కోర్సు ఆఫ్‌లైన్, మరో కోర్సు ఆన్లైన్లో చదవాలి.
- కొత్త సిలబస్ రూపకల్పన కోసం 13 బీవోఎస్లను ఏర్పాటు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BTech
- Diploma
- JNTU
- JNTU Hyderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

