పల్లె రవికి త్రుటిలో తప్పిన ప్రమాదం
తెలంగాణ కల్లు గీతకార్మిక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్‌గౌడ్‌కు మంగళవారం త్రుటిలో ప్రమాదం తప్పింది. ఉగాది రోజున కొత్తపేటలోని రైతుబజార్ ఎదురుగా రవికుమార్ ప్రయాణిస్తున్న కారు టైరు పగిలింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి కారును డివైడర్ వైపు తిప్పడంతో పెనుప్రమాదం తప్పింది.
ఎల్బీనగర్, ఏప్రిల్ 9: తెలంగాణ కల్లు గీతకార్మిక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నేత పల్లె రవికుమార్‌గౌడ్‌కు మంగళవారం త్రుటిలో ప్రమాదం తప్పింది. ఉగాది రోజున కొత్తపేటలోని రైతుబజార్ ఎదురుగా రవికుమార్ ప్రయాణిస్తున్న కారు టైరు పగిలింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి కారును డివైడర్ వైపు తిప్పడంతో పెనుప్రమాదం తప్పింది. ఉగాది పండుగ కావడంతో రైతుబజార్ ప్రాంతం, జాతీయ రహదారిపైనా రద్దీ ఉన్నప్పటికీ ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు.
ప్రమాదం జరిగిన సమయంలో కారులో బెలూన్లు ఓపెన్ కావడంతో రవికుమార్‌తోపాటు కారులో ఉన్న ఆయన మిత్రుడు రాజు, డ్రైవర్ ఖదీర్ స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఖైరతాబాద్‌లోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్న మిత్రుడిని మంగళవారం ఉదయం పరామర్శించి, తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. కారు టైరు పేలడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రవికుమార్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

