హైదరాబాద్/సిటీబ్యూరో, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ)/బడంగ్‌పేట: ప్రముఖ జర్నలిస్టు, విశ్లేషకుడు ఇలపావులూరి మురళీమోహనరావు(68) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్ బడంగ్‌పేటలో నివాసం ఉంటున్న ఆయన ఆదివారం ఆం ధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలోని తన స్వగ్రామం అద్దంకి వెళ్లారు. అక్కడ అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని సోమవారం అద్దంకి నుంచి స్వగృహానికి తరలించి, బడంగ్‌పేట స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
మురళీమోహనరావు మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సం తాపం ప్రకటించారు. ఆయన చేసిన చర్చలు, విశ్లేషణలు, రచనలు ముకుసూటిగా ఉండేవని సీఎం గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ప్రజల శ్రేయోభిలాషిగా తెలంగాణ వాదాన్ని వినిపించిన ఇలపావులూరి మరణం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాలను సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజల వద్దకు తీసుకెళ్లడంలో మురళీమోహనరావు ప్రత్యేక పాత్ర పోషించారు.
టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా అవతరిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కొనసాగుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలని ఆకాంక్షించారు. గత కొంతకాలంగా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు, బీజేపీ అనుసరిస్తున్న ఆర్థిక, అరాచక విధానాల పట్ల ఆయన తీవ్ర నిరసన ప్రకటించారు. మురళీమోహనరావు మృతి పట్ల టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్, పలువురు పాత్రికేయులు, రాజకీయ ప్రముఖులు సం తాపం వ్యక్తంచేశారు. ‘నమస్తే తెలంగాణ’ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, టీ న్యూస్ సీఈవో శాస్త్రి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సురేశ్, బ్యూరో చీఫ్ సీతారామరాజు, ఇన్పుట్ ఎడిటర్ వెంకట్, షరీఫ్, స్థానిక టీఆర్ఎస్ నాయకుడు పెద్దబావి ఆనంద్‌రెడ్డి తదితరులు ఇలపావులూరి భౌతిక కాయానికి నివాళి అర్పించారు.
సీఎం కేసీఆర్ గురించి ఇలా..
ఇలపావులూరి మురళీమోహన్రావు ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఇటీవల ఇలా రాసుకున్నారు.. ‘ఆదరిస్తున్న అందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు. ఏడాది క్రితం నా జీవితాన్ని మేలిమలుపు తిప్పిన ఒక మహానాయకుడి గురించి వివరంగా చెప్పాలి. సమయం వచ్చినప్పుడు రాస్తాను. ఆయనకు నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా రుణం తీరదు.
భవదీయుడుఇలపావులూరి మురళీమోహనరావు