చెన్నై: నాగపట్టినం ఎంపీ, కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేత ఎం సెల్వరాజ్ (67) అనారోగ్య సమస్యలతో సోమవారం కన్నుమూశారు. ఆయనకు భార్య కమలావతనమ్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన 1957లో తిరువరుర్ జిల్లాలో జన్మించారు. ఆయన 1989, 1996, 1998, 2019 లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించారు. డెల్టా రైతులకు మద్దతుగా సెల్వరాజ్ అనేక పోరాటాలు చేశారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సీపీఐ రాష్ట్ర శాఖ కార్యదర్శి ఆర్ ముత్తరాసన్ ప్రగాఢ సంతాపం తెలిపారు.