Meenakshi Natarajan | మీనాక్షి కేసు గురించి చెప్పింది.. టీ కాంగ్రెస్ నేతలే.. బాంబు పేల్చిన మధ్యప్రదేశ్ మంత్రి
Meenakshi Natarajan | కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయ్ వర్గియా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Meenakshi Natarajan | హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు కైలాష్ విజయ్ వర్గియా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీనాక్షీనటరాజన్ మీద తెలంగాణలో కేసుల గురించి టీ కాంగ్రెస్ నేతలే తమకు సమాచారం ఇచ్చారని బాంబు పేల్చారు.
మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ‘అసలు మీనాక్షీనటరాజన్ మీద తెలంగాణలో కేసు నమోదైనట్టు మాకు తెలియనే తెలియదు. తెలంగాణ కాంగ్రెస్ నుంచే ఆ సమాచారం మాకు వచ్చింది. అక్కడి కాంగ్రెస్ పార్టీ నేతలే మాకు ఈ సమాచారం ఇచ్చారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అక్కడి నుంచే మాకు ఈ కేసు పత్రాలొచ్చాయి. దీనిని బట్టి కాంగ్రెస్‌లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి’ అని వ్యాఖ్యానించారు.
మొత్తంగా కైలాష్ విజయ్ వర్గియా వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌లో పెను ప్రకంపనలకు దారితీశాయి. మీనాక్షికి, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా కొందరు టీ కాంగ్రెస్ నేతలు కోవర్ట్ రాజకీయాలు నడుపుతున్నారని ఇప్పటికే కొన్ని వార్తలొచ్చాయి. కైలాష్ వర్గియా వ్యాఖ్యలు ఇందుకు మరింత బలాన్ని చేకూర్చాయని పలువురు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

