హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): వైద్య శాఖలో 201 పోస్టులకు ఎంపికైన వారి జాబితాను మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. ఆయుష్‌లో 156మెడికల్ ఆఫీసర్ పోస్టులు, ఎంఎన్‌జే దవాఖానాలో 45 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు సంబంధించి సెలక్షన్ లిస్ట్‌ను శనివారం విడుదల చేసింది.
ఈ పోస్టుల భర్తీతో ఆయుష్ వైద్య సేవలు మరింత మెరుగు అవుతాయని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హర్షం వ్యక్తంచేశారు.