న్యాల్కల్, ఆగస్టు 25: సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రానికి చెందిన యువ శిల్పకారుడు డాక్టర్ హోతి బస్వరాజ్ తయారుచేసిన కళాఖండం 63వ జాతీయస్థాయి శిల్పకళా ప్రదర్శనకు ఎంపికైంది. ఈనెల 28న న్యూఢిల్లీలోని లలిత కళా అకాడమీ రవీంద్ర భవన్లో ఈ కళాఖండాన్ని ప్రదర్శించేందుకు జాతీయ కళా ప్రదర్శన అకాడమీ ఆహ్వానించింది.
ఏటా జరిగే జాతీయ కళా ప్రదర్శనకు దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన శిల్పకారులు తయారుచేసిన వేల సంఖ్యలో కళాఖండాలను పంపుతారు. అందులో బస్వరాజ్ రూపొందించిన కళాఖండం ‘గోల్డెన్ కేజ్’ అనే టైటిల్ ప్రదర్శనకు ఎంపికైంది. తన కళాఖండం జాతీయ ప్రదర్శనకు ఎంపికకావడం సంతోషంగా బస్వరాజ్ తెలిపారు.