ఓక్లాండ్ (యూఎస్): మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)లో వాషింగ్టన్ ఫ్రీడమ్, ఎంఐ న్యూయార్క్ మధ్య గురువారం జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్ రికార్డుల దుమ్ముదులిపింది. న్యూయార్క్ నిర్దేశించిన 267 పరుగుల లక్ష్యాన్ని వాషింగ్టన్.. మరో 8 బంతులుండగానే 18.4 ఓవర్లలో ఊదేసి ఈ ఫార్మాట్లో అత్యధిక ఛేదనను నమోదుచేసింది.
ఆ జట్టు తరఫున వికెట్‌కీపర్ ఆండ్రీస్ గౌస్ (51 బంతుల్లో 10 ఫోర్లు, 12 సిక్స్‌లతో 132),కెప్టెన్ స్టీవ్ స్మిత్ (48 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 110 నాటౌట్) దంచికొట్టారు. 2026 ఐపీఎల్లో పంజాబ్.. ఢిల్లీపై 265 రన్స్ ఛేదించడమే ఇప్పటిదాకా టీ20ల్లో హయ్యస్ట్ ఛేజ్. మొదట బ్యాటింగ్ చేసిన న్యూయార్క్ సారథి నికోలస్ పూరన్ (33 బంతుల్లో 5 ఫోర్లు, 13 సిక్స్‌లతో 106), కీరన్ పొలార్డ్ (25 బంతుల్లో 1 ఫోర్, 8 సిక్స్‌లతో 64) సిక్సర్ల జడివాన కురిపించారు.
కానీ బౌలర్లు తేలిపోవడంతో ఆ జట్టుకు పరాభవం తప్పలేదు. ఇక ఒక మ్యాచ్‌లో ముగ్గురు శతకాలు సాధించడం కూడా టీ20ల్లో ఇది మొదటిసారి. రెండు జట్ల తరఫున ఏకంగా 51 సిక్సర్లు నమోదవడం కూడా ఇదే ప్రథమం. గౌస్, స్మిత్ మూడో వికెట్‌కు 89 బంతుల్లోనే ఏకంగా 241 పరుగులు జోడించారు. ఈ ఫార్మాట్లో ఇది మూడో అత్యధిక భాగస్వామ్యం.