ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 17:34:31

రెబ్బెనలో భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత

రెబ్బెనలో భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత

కుమ్రం భీం అసిఫాబాద్ : జిల్లాలోని రెబ్బెన మండల కేంద్రంలో మంగళవారం పోలీసులు భారీ స్థాయిలో గుట్కాతో పాటు  రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు ఆసిఫాబాద్ డీఎస్పీ అచ్చేశ్వర్రావు, రెబ్బెన సీఐ సతీశ్ కుమార్, ఎస్ఐ దీకొండ రమేష్ అనుమానితుల ఇండ్లలో సోదాలు నిర్వహించారు. 12 లక్షల 27 వేల రూపాయల విలువగల గుట్కా ప్యాకెట్లు, లక్షా  59 వేల రూపాయల విలువగల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

జిల్లాలో అక్రమంగా నిషేధిత  గుట్కాలు సరఫరా చేస్తున్న గోళెం తిరుపతి, ఎస్కే ఇంతియాజ్ హైమద్ తోపాటు పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిలువ ఉంచిన కొలిపాక కిరణ్‌పై కేసు నమోదు చేశారు. కాగా, జిల్లాలో ఇంత భారీ మొత్తంలో గుట్కా పట్టుబడటం ఇదే తొలిసారి.  


logo