హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విత్తన వారోత్సవాలలో భాగంగా విత్తన పంపిణీకి రంగం సిద్ధం చేసింది. జూన్ 2న పంపిణీ ప్రారంభించనున్నట్టు ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. ప్రతీ గ్రామం నుంచి ముగ్గురి నుంచి ఐదుగురు అభ్యుదయ రైతులకు నాణ్యమైన విత్తన సంచులను పంపిణీ చేయనున్నట్టు చెప్పారు.
ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతులమీదుగా ప్రారంభించనున్నట్టు తెలిపారు. జూన్ 3వ తేదీ నుంచి వ్యవసాయ విశ్వవిద్యాలయ కేంద్రాల్లో వరి, కంది, మక్క, పెసర, మినుము, ఆముదం, చిరుధాన్యాలకు సంబంధించిన 8,500 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీకి సిద్ధంగా ఉంచినట్టు అల్దాస్ జానయ్య వివరించారు.