Harish Rao | పరిపాలన కేంద్రంగా ఉండాల్సిన సచివాలయం కాంగ్రెస్ పాలనలో ధర్నాచౌక్ లా మారిందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మొన్న చిన్న కాంట్రాక్టర్లు సచివాలయం లోపల ధర్నా చేస్తే.. బిల్లులు చెల్లించాలంటూ ప్రభుత్వ అద్దె వాహన యజమానులు సచివాలయం ఎదుట ఆందోళన చేసిన దుస్థితి నెలకొందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ, అసమర్థ పాలనకు నిదర్శనమిదీ అని అన్నారు.
కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. చిన్న కాంట్రాక్టర్లు, చిరు ఉద్యోగులకు చెల్లించాల్సిన బిల్లులు, జీతాలు నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడం శోచనీయమని హరీశ్‌రావు విమర్శించారు. వాహన అద్దె బిల్లులు హైదరాబాద్‌లో 10 నెలలుగా, జిల్లాల్లో 2 సంవత్సరాలుగా పెండింగ్‌లో పెట్టడం అన్యాయమని అన్నారు. కమీషన్లు ఇవ్వడం లేదని అద్దె వాహనాల బిల్లులు చెల్లించడం లేదా అని నిలదీశారు. యజమానుల కష్టాలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వెంటనే అద్దె వాహనాల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
పరిపాలన కేంద్రంగా ఉండాల్సిన సచివాలయం కాంగ్రెస్ పాలనలో ధర్నాచౌక్ లా మారింది.
పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మొన్న చిన్న కాంట్రాక్టర్లు సచివాలయం లోపల ధర్నా చేస్తే..
బిల్లులు చెల్లించాలంటూ ప్రభుత్వ అద్దె వాహన యజమానులు సచివాలయం ఎదుట ఆందోళన చేసిన దుస్థితి.
కాంగ్రెస్ ప్రభుత్వ… pic.twitter.com/gi3s6d3tpa
— Harish Rao Thanneeru (@BRSHarish) October 21, 2025