శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రెండో రన్‌వే
శంషాబాద్ విమానాశ్రయంలో రెండో రన్‌వే ఏర్పాటు కానున్నది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం నిర్ణయించింది. రెండో రన్‌వే ఏర్పాటుకు జీఎమ్మార్ సంస్థకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. శంషాబాద్ విమానాశ్రయం కోల్‌కతా, మద్రాస్‌లను వెనక్కు నెట్టి దేశంలోనే
విస్తీర్ణం పరంగా మన విమానాశ్రయం
ఢిల్లీ ఎయిర్‌పోర్టు కన్నా పెద్దది : కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ విమానాశ్రయంలో రెండో రన్‌వే ఏర్పాటు కానున్నది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం నిర్ణయించింది. రెండో రన్‌వే ఏర్పాటుకు జీఎమ్మార్ సంస్థకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. శంషాబాద్ విమానాశ్రయం కోల్‌కతా, మద్రాస్‌లను వెనక్కు నెట్టి దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచిందని సీఎం కేసీఆర్ వివరించారు. విస్తీర్ణ పరంగా ఢిల్లీతో పోల్చినా మన ఎయిర్‌పోర్టే పెద్దదని చెప్పారు.
ఢిల్లీ విమానాశ్రయం ఐదు వేల ఎకరాలు ఉండగా.. శంషాబాద్ విమానాశ్రయం 5,200 ఎకరాలు ఉన్నదన్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రెండో రన్‌వే ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జీఎమ్మార్ సంస్థను ఆదేశించామని తెలిపారు. ఇప్పుడున్న టెర్మినల్‌కు దక్షిణంలో పాత రన్‌వే ఉన్నదని, టెర్మినల్ మధ్యలో ఉత్తరం దిక్కుకు మరో రన్ వే వస్తుందన్నారు.ఈ రంగంలో మనం రెండోస్థానంలో ఉన్నాం కాబట్టి కొత్తగా ఏర్పాటుచేసే సీఐఈ యూనివర్సిటీలో సివిల్ ఏవియేషన్ కోర్సులను ప్రారంభించాలని ఆదేశించామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Airport
- run way
- second
- shamshabad
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

