హైదరాబాద్, జూన్20 (నమస్తే తెలంగాణ): బీసీ, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు రెండో మెరిట్ జాబితాను విడుదల చేశారు. టీజీఆర్డీసీ సెట్ 2024 కన్వీనర్ బడుగు సైదులు గురువారం ప్రకటన విడుదల చేశారు. సీట్ల కేటాయింపు వివరాలకు <https: //tgrdccet.cgg.gov.in> వెబ్ సైట్లో చూసుకోవాలని తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు 26లోగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు.