Vemulawada | వేములవాడ టౌన్, మే 29: వేములవాడ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారిని బుధవారం రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ పార్థసారధి దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆయన రాజరాజేశ్వరస్వామి, పార్వతీ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అద్దాల మండపంలో అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో వినోద్ రెడ్డి వారికి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఆయన వేములవాడ తహశీల్దార్ విజయప్రకాశ్ రావు, ఆలయ ప్రోటోకాల్ ఏఈవో అశోక్ కుమార్, పర్యవేక్షకులు వరి నర్సయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ నూగూరి నరేందర్, సిబ్బంది పాల్గొన్నారు.