హైదరాబాద్, సెప్టెంబర్20 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్ పిల్లర్ కుంగుబాటునకు కచ్చితమైన కారణాలు తెలియాలంటే సమగ్ర పరీక్షలు నిర్వహించాలని ఎస్డీఎస్వో (స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్) ఇంజినీర్లు జస్టిస్ ఘోష్ ఎదుట నివేదించా రు. బరాజ్‌లపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ బీఆర్కే భవన్లో శుక్రవారం కొనసాగింది. విచారణకు టీజీఈఆర్ఎల్ (తెలంగాణ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ), ఎస్డీఎస్వో విభాగం జేడీ, సీఈలు, ఈఈలు హాజరయ్యా రు.
బరాజ్‌ల నిర్మాణానికి ముందు, మధ్య, తర్వాత కూడా మోడల్ స్టడీస్ కండక్ట్ చేసినట్టు రీసెర్చ్ ఇంజినీర్లు వెల్లడించారు. బరాజ్‌ల డ్యామేజీకి మోడ ల్ స్టడీస్‌కు సంబంధం లేదని, నిబంధనల ప్రకారమే టీఎస్ ఈఆర్ఎల్ పని చేసిందని లొకేషన్, సీడీవో అథారిటీ రిపోర్ట్స్ ఆధారంగా రీసెర్చ్ చేశామని వివరించారు. మూడు బరాజ్‌లు కూడా డ్యామ్‌సేఫ్టీ యాక్ట్ పరిధిలోకి వచ్చాయని, ఆ చట్టాన్ని అనుసరించి దేశంలోనే మొట్టమొదటగా ఎస్డీఎస్వోను ఏర్పాటు చేసిన రాష్ట్రం తెలంగాణ అని ఎస్డీఎస్వో అధికారులు గుర్తుచేశారు. పూర్తిస్థాయి పరీక్షలతోనే కారణాలు వెల్లడించవచ్చని చెప్పారు.