హైదరాబాద్, డిసెంబర్13 (నమస్తే తెలంగాణ): మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను ఈ నెల 15 నుంచి చేపట్టనున్నట్టు బీసీ సంక్షేమ శాఖ వెల్లడించింది. పథకం కింద ఆర్థిక సాయానికి మొత్తం 2,665 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారని తెలిపింది. వీరిలో 2,023 మంది అభ్యర్థులు బీసీ వారు కాగా, 642 మంది ఈబీసీ అభ్యర్థులున్నారని వివరించింది. అభ్యర్థులు నిర్దేశిత తేదీల వారీగా మాసబ్ ట్యాంక్ వద్ద ఉన్న సంక్షేమభవన్, ఆరో అంతస్తుకు పూర్తి సర్టిఫికెట్లతో హాజరుకావాలని సూచించింది. వివరాలకు https:// telanganaepass. cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని కోరింది.