హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): దసరా, దీపావళి తదితర పండుగల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో మాల్దా నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ల మధ్య 16 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు గురువారం రైల్వే అధికారులు తెలిపారు.
అక్టోబర్ 8 నుంచి నవంబర్ 28 వరకు ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు. విశాఖపట్నం-షిర్డీ, షాలీమార్-హైదరాబాద్, సికింద్రాబాద్, బెంగళూరు-దానాపూర్ రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను ఈ నెల 4, 5 తేదీల్లో పునరుద్ధరించినట్టు తెలిపారు. న్యూఢిల్లీ-చెన్నై, గూడూరు-సికింద్రాబాద్, మణుగూరు-సికింద్రాబాద్ స్టేషన్ల మధ్య ఈనెల 5న పలు రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.