హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): దసరా, దీపావళి వరుస పండుగలను దృష్టిలో పెట్టుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు రైల్వే అధికారుల బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అందులో భాగంగా గోమ్తినగర్-మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ల మధ్య 12 రైళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ నెల 28, 29 తేదీల్లో ఈ రైళ్ల రాకపోకలు కొనసాగిస్తాయని అధికారులు తెలిపారు.