Special Train | సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైలే తెలిపింది. సికింద్రాబాద్-తిరుపతి (రైలు నంబర్ 07489) 17, 24, 31న నడుపనున్నట్లు తెలిపింది. తిరుపతి – సికింద్రాబాద్ (రైలు నంబర్ 07490) 19, 26 తేదీల్లో నడువనున్నది. అలాగే సికింద్రాబాద్-దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ – దానాపూర్ ( రైలు నంబర్ 03226) మార్చి 19, 26 తేదీల్లో నడవునున్నది.
ఆయా రోజుల్లో ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్‌లో ప్రారంభమై.. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు దానాపూర్‌కు చేరుకుంటుంది. దానాపూర్ – సికింద్రాబాద్ (రైలు నంబర్ 03225) ట్రెయిన్ 16, 23 తేల్లో నడువనున్నాయి. దానాపూర్‌లో సాయంత్రం 8.50 గంటలకు దానాపూర్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.40 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకోనుంది. రైళ్లు కాజీపేట్, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, సిర్పూర్, కాగజ్‌నగర్‌తో పాటు పలు రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి. సెకండ్ క్లాస్ కోచ్‌లతో పాటు స్లీపర్, ఏసీ కోచ్‌లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.