హైదరాబాద్: లింగంపల్లి- విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (Janmabhoomi Express) రైళ్ల ప్రయాణ వేళలు మారాయి. కొత్త వేళలు వచ్చేఏడాది ఫిబ్రవరి 15 నుంచి అమల్లోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే (SCR) వెల్లడించింది. లింగంపల్లి-విశాఖపట్నం (12805) రైలు ఉదయం 6.55 గంటలకుకి లింగంపల్లి నుంచి బయల్దేరి, రాత్రి 7.50 గంటలకు విశాఖపట్నంకు చేరుకుంటుంది. అదేవిధంగా విశాఖపట్నం-లింగంపల్లి (12806) రైలు ఉదయం 6.20 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరి, రాత్రి 7.15 గంటలకు లింగంపల్లికి చేరుతుందని తెలిపింది.
మరోవైపు సంక్రాంతి పండుగ నేపథ్యంలో వివిధ స్టేషన్ల మధ్య నడుస్తున్న వీక్లీ రైళ్లను మరికొన్ని వారాలపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-అనకాపల్లి (07041) రైలు జనవరి 4, 11, 18 తేదీల్లో, అనకాపల్లి-సికింద్రాబాద్ (07042) రైలు జనవరి 5, 12, 19న ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. హైదరాబాద్-గోరఖ్‌పుర్ (07075) రైలు జనవరి 9, 16, 23 తేదీల్లో, గోరఖ్‌పుర్-హైదరాబాద్(07076) రైలు జనవరి 11 18, 25 తేదీల్లో బయల్దేరుతుందని వెల్లడించింది.