SC Gurukula Degree Colleges | హైదరాబాద్, మార్చి14 (నమస్తే తెలంగాణ): ల్యాబ్సౌకర్యాలు లేని ఏడు ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో సైన్స్ కోర్సులను ఎత్తివేసి, ఆర్ట్స్ కోర్సులకే ప్రవేశాలను పరిమితం చేయాలని నిర్ణయించామని సోషల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి వెల్లడించారు. వాటిని బిజినెస్ స్కూల్స్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీల సంఖ్యను తగ్గిస్తున్నారనే వార్తలను తోసిపుచ్చారు.
రాష్టంలో మొత్తం 30 డిగ్రీ కళాశాలలు ఉండగా 28 ప్రైవేట్ భవనాల్లో కొనసాగుతున్నాయని, 2 కళాశాలలు ఇతర ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయని వివరించారు. వీటిలో 6 కళాశాలలకు చెందిన ప్రైవేట్ భవనాల యజమానులు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని, వా టిని సమీపంలోని కళాశాలల్లో విలీనం చేయాలని ప్రి న్సిపాళ్లను ఆదేశించామని వెల్లడించారు. కళాశాలల్లో అవసరాలరీత్యా గురుకులాల విలీనం సాధారణమేనని, అంతేకానీ ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీల సంఖ్య ను ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గించబోమని వెల్లడించారు.