జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 28 : సైన్స్ మానవ జీవన ప్రమాణాల పెంపునకు దోహదపడుతుందని నోబెల్ బహుమతి గ్రహీత, జెనెటిక్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ గ్రెగ్ ఎల్ సెమెంజాతొ అన్నారు. ఎన్నో ఆవిష్కరణలకు బాటలు వేసిన సైన్స్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని విద్యార్థులకు సూ చించారు. బుధవారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భం గా హైదరాబాద్ గీతం డీమ్డ్ వర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో సెమెంజాతొ మాట్లాడుతూ.. సృజనాత్మకతతో ప్రయోగాలను ఆవిష్కరించాలని చెప్పారు. శరీర కణాలు ఆక్సిజన్‌ను ఎలా అందజేస్తున్నాయో అర్థం చేసుకోవాలని.. ఆ ఆక్సిజన్ స్థాయిలను నియంత్రిస్తున్న ప్రొటీన్ హెపైక్సియా ప్రేరేపించగల కారకాన్ని కనుగొనడానికి చేపట్టిన సంచలనాత్మక పరిశోధన తనకు నోబెల్ బహుమతి తెచ్చిపెట్టిందని వివరించారు. ఈ సందర్భంగా గ్రెగ్‌ను డీఎస్టీ కార్యదర్శి డాక్టర్ ఎస్ చంద్రశేఖర్, గీతం అదనపు కులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు సత్కరించారు. కార్యక్రమంలో ఎపిస్టెమో వికాస్ లీడర్షిప్ స్కూల్, కానరీ ది గ్లోబల్, డీపీఎస్ మియాపూర్, శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్, కీసర పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, జెనెసిస్ స్కూళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు.