హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ) : సంక్రాంతి సెలవులు ముగియడంతో రాష్ట్రంలోని బడులు బుధవారం నుంచి యథావిధిగా ప్రారంభమవుతాయి. ఈ నెల 13 నుంచి 17 వరకు బడులకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు సెలవుల్లో ఎంజాయ్ చేసిన పిల్లలంతా ఉదయం నుంచి బడిబాట పడతారు. ఈ నెల 16న జూనియర్ కాలేజీలు తెరుచుకొన్నాయి.